Revanth Reddy: తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యం...! 1 y ago
టీజీ : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మహిళలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు చేయూతనిస్తున్నామన్నారు.
మహిళా సంఘాలను పునరుద్ధరిస్తామని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని అన్నారు. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు.
ఆదానీ, అంబానీలు పోటీపడే సోలార్ ప్రాజెక్టుల్లో మహిళలను ప్రోత్సహిస్తామన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని ఏడాదికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. గతంలో మామూలు చీరలు ఇచ్చేవారని.. కానీ ఇప్పుడు నాణ్యమైన చీరలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో మహిళా సంఘాలను పట్టించుకోలేదన్నారు. మహిళలు వ్యాపారాల్లో వేగంగా ఎదిగేలా చూస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై కోటి మందితో మహిళా శక్తి ప్రదర్శిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలన్నారు.